NTV Telugu Site icon

Tirupati: వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భారీగా తరలిన భక్తులు

New Project (44)

New Project (44)

గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు. గరుడవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడవీధులలో విహరించిన స్వామివారిని చూసి భక్తులు పరవశించారు. గరుడసేవ సందర్భంగా.. ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు, కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు ఊరేగింపును మరింతగా ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

READ MORE: విమాన ప్రమాదాల్లో మరణించిన దేశాధినేతలు వీరే..!

మరోవైపు గోవిందరాజస్వామి గరుడసేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి కానుకగా రూ.10 లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు. తన సోదరుడు అయిన గోవిందరాజునికి తిరుమల శ్రీవారు పది లక్షలు విలువచేసే.. మూడు ఆభరణాలు, వజ్రపు పోగులు, లక్ష్మి కాసు మాల, తెల్ల రాళ్ల పతకాన్ని బహుకరించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 22న నృసింహ జయంతి నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ యోగ నరసింహస్వామి మూల‌మూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. అనంతరం వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి పూజ నిర్వహిస్తారు. మే 23వ తేదీ వైశాఖ పౌర్ణమి గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల టైం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం చాలా కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు.