Rifle Bullets In Train: వందలాది రైఫిల్ బుల్లెట్లతో రైలులో ప్రయాణించిన అమ్మాయి
- రైలులో వందలాది రైఫిల్ బుల్లెట్లతో.
- ప్రయాణించిన అమ్మాయి.
- ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rifle Bullets In Train: ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో GRP బుధవారం వారణాసి ఛప్రా ప్యాసింజర్ రైలు నుండి రైఫిల్స్ సంబంధించిన 750 బుల్లెట్లతో ఒక అమ్మాయిని అరెస్టు చేసారు పోలీసులు. మిర్జాపూర్‌కు చెందిన బాలిక బట్టలకు బదులు ట్రాలీ బ్యాగ్‌లో బుల్లెట్లు పెట్టుకుని చాప్రా వెళ్తోంది. ప్రస్తుతం పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైఫిల్స్ కాకుండా, ఈ 315 బోర్ బుల్లెట్లను నేరస్థులు అక్రమ పిస్టల్స్‌లో ఉపయోగిస్తారు. ఇక బాలిక విచారణలో మరో ఇద్దరి పేర్లు బయటపడ్డాయి. పోలీసులు అమ్మాయిపై ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also: Big C Mobiles Offers: ‘బిగ్ సీ’లో బంపర్ ఆఫర్స్.. ప్రతి మొబైల్ కొనుగోలుపై 10 వేలు..!
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
గోరఖ్‌పూర్ ఎస్పీ ఆదేశాల మేరకు జీఆర్‌పీ బుధవారం రైళ్లలో ఇంటెన్సివ్ చెకింగ్ మొదలు పెట్టింది. కాగా, వారణాసి నుంచి చాప్రా వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఉదయం 8.40 గంటల ప్రాంతంలో స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంది. రెండో బోగీలో కూర్చున్న ఓ బాలిక సీటు కింద ఉన్న ట్రాలీ బ్యాగ్‌ని జీఆర్పీ తనిఖీ చేయగా అందులో వందలాది కాట్రిడ్జ్‌లు ఉండడంతో అక్కడి వారందరు ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో బాలికను బ్యాగ్‌తో సహా స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Read Also: Canada Govt: కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం.. వలసదారుల సంఖ్య భారీగా తగ్గింపు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో అంకిత్ కుమార్ పాండే, రోషన్ యాదవ్ తనకు క్యాట్రిడ్జ్‌లతో కూడిన బ్యాగ్ ఇచ్చారని బాలిక చెప్పింది. ఆ సంచి చాపర్‌లోని ఓ వ్యక్తికి ఇవ్వాల్సి ఉందని తెలిపింది. బాలికను మీర్జాపూర్‌లోని రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిహార్ నివాసి మణితా సింగ్‌గా గుర్తించారు. బాలికతో పాటు ఘాజీపూర్ జిల్లా కరీముద్దీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాచ్‌వార్ నివాసి సుశీల్ పాండే కుమారుడు అంకిత్ కుమార్ పాండే, నసీర్‌పూర్ కటారియా నివాసి రామ్‌నారాయణ్ సింగ్ యాదవ్ కుమారుడు రోషన్ యాదవ్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు సంబంధించి ఒక టీమ్ ఛప్రా వెళ్తుంది. ప్రస్తుతం ఇంత పెద్ద సంఖ్యలో బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాటిని బట్వాడా చేసేది ఎవరు? ఈ కేసులో ఎంత పెద్ద రాకెట్ దాగుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!