West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థినిపై యువకుడి కత్తి దాడి.
- ప్రేమ ప్రతిపాదన తిరస్కరించడంతో కక్షతో దాడి.
- తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు సమీపంలో దారుణ సంఘటన జరిగింది. లవ్ ప్రపోజల్ తిరస్కరించిందే కారణంతో ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో, తీవ్ర గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. హౌరా జిల్లాలోని అండుల్ ప్రాంతంలో మహియారి ఖతిర్ బజార్‌లోని చంద్నీ బాగాన్‌లో ఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న బాలిక సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా, 24 ఏళ్ల సమీర్ దాస్ ఆమెను అడ్డగించి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతి, పొత్తికడుపు భాగాల్లో పలుమార్లు పొడవడంతో ఆమె రోడ్డుపైనే కుప్పకూలింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హౌరా జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ఘటన తర్వాత సమీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
నిందితుడు ముర్షిదాబాద్‌లోని మయూరేశ్వర్కు చెందిన వాడని, డోర్జూర్ లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తేలింది. పలుమార్లు ఇతను బాలికను ప్రేమ పేరుతో వేధించినట్లు తెలుస్తోంది. ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత అండుల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు.
తాజావార్తలు
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్‌ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!