ఆడపిల్లల రక్షణ ఎన్ని చట్టాలు వచ్చినా అవి ఏం చేయలేకపోతున్నాయి. ఎక్కడో అక్కడ వారికి అన్యాయం జరుగుతుంది. వారిపై అఘాయిత్యాలకు నిలుపుదల లేకుండా ఉంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మహిళలు ధైర్యంగా ఉండగలగాలి. ఏ క్షణంలో ఎటువంటి సమస్య వచ్చిన ఆత్మస్థైర్యంతో ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. ఓ రెస్టారెంట్ లో ఓ వెయిట్రస్ పట్ల ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. అంతే లేడీ బ్రూస్లీలాగ వారిపైకి విరుచుకుపడింది. దెబ్బకి వాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : AP Cabinet Reshuffle: కేబినెట్‌లో మార్పులు.. ఇలా స్పందించిన రోజా, అంబటి
ఓ రెస్టారెంట్ లో ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు. వారికి వెయిట్రస్ వడ్డిస్తోంది. ఉన్నట్టుండీ ఆ యువకుల్లో ఒకడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయాడు. తమ పక్కన వచ్చి కూర్చోమని బలవంతం చేశాడు. వెంటనే ఆమె అతనిని తన పంచ్ లతో ప్రతిఘటించింది. అంతలో ఆమెను అడ్డుకోవడానికి అతని స్నేహితుడు రంగంలోకి దిగడంతో అతడిని కాలితో ఎగిరెగిరి తన్నింది. దెబ్బకి ఇద్దరు అక్కడి నుంచి పరార్ అయ్యారు. తనను తాను రక్షించుకోవడం కోసం ఆమె ధైర్యంగా పోరాడిన తీరు ఇన్స్పిరేషన్ కలిగిస్తోందని నెటిజన్స్ అంటున్నారు.
— caption this. (@harikarotalar) March 29, 2023
Also Read : IMF bailout for Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కనున్న ద్వీపదేశం
క్యాప్షన్ దిస్ అనే టైటిల్ తో ట్విట్టర్ లో షేర్ అయిన ఈ వీడియోని చూసిన జనం వెయిట్రస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూ లేడీ బ్రూస్లీగా అభివర్ణించారు. ఎటువంటి పరిస్థితుల్ని అయినా ధైర్యంగా ఎదుర్కునేలా ఈ వీడియో ఎంతోమంది ఆడపిల్లలకు ప్రేరణగా నిలుస్తోంది.