మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వాడే.. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని.. ఏఐసీసీ సభ్యులుగా చిరంజీవి కొనసాగుతున్నారని గుర్తుచేశారు. తమ్ముడు అనే కారణంతోనే పవన్ కల్యాణ్‌కి చిరంజీవి సహాయం చేసి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ, దీనిపై కొందరు చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ మండిపడ్డారు.. ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఫెయిల్ అయ్యాయన్నారు. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని…
చిరంజీవికి.. పవన్ కల్యాణ్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.. నేను రాజకీయాలకు పనికి రాను.. తమ్ముడు పనికొస్తారని గతంలోనే చిరంజీవి అన్నారని గుర్తుచేశారు.. అంటే.. చంద్రబాబు చెప్పినట్టు తాను చేయలేనని.. పవన్ కల్యాణ్ చేయగలడనే విషయం తెలుసు కాబట్టే పవన్ రాజకీయాలకు పని కొస్తాడని చిరంజీవి అన్నారంటూ చెప్పుకొచ్చారు