NTV Telugu Site icon

Gidugu RudraRaju: కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని సీపీఐని కోరా

Gidugu 1

Gidugu 1

సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వచ్చారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో గిడుగు భేటీ అయ్యారు. ఇరు పార్టీల నేతల మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కామన్ అజెండాతో పని చేశాయి. గతంలో అనేక అంశాల్లో‌ కలిసి పని చేశాం. రామకృష్ణతో సహా అనేక మందితో విద్యార్థి దశలో కలిసి నడిచాం. భవిష్యత్ రాజకీయాలపై చర్చే తప్ప, ప్రణాళికలు ఏమీ లేవు.

సీనియర్ నేతగా రామకృష్ణ సలహాలు, సూచనలు తీసుకుంటానన్నారు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. సమస్యలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి గిడుగు రుద్రరాజు.దేశ రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి.భావ సారూప్యత ఉన్న పార్టీలు ఏకం‌ కావాల్సిన అవసరం ఉంది.అతి పెద్ద లౌకిక‌ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటాలు చేస్తాం.లౌకిక శక్తులను ఏకం చేసి బీజేపీని ఓడించాలని మా జాతీయ మహా సభల్లో తీర్మానం చేశాం.2024లో విభేదాలు పక్కన పెట్టి లౌకిక పార్టీలు కలవాలి.మోడీ మళ్లీ‌ వస్తే రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతుంది.

Read Also: Bonda Umamaheshwar Rao: కాపులు వైసీపీని నమ్మడం లేదు

ఐక్యతతో ఫ్యాక్షనిస్టు, మతోన్మాద పార్టీలను తరిమి కొట్టాలి.ఏపీలో జగన్ దుర్మార్గపు‌ పాలన సాగిస్తున్నారు.రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారు.ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి.ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కలిసి పోరాటం చేస్తాం.నిరసన కార్యక్రమం చేపట్టకుండా నోరు నొక్కేలా కుట్ర చేస్తున్నారు.ఎనిమిదేళ్లుగా మోడీ మోసం చేస్తున్నా జగన్ అడగలేక పోతున్నారు.దేశంలో, రాష్ట్రంలో భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పోరాడతాం అన్నారు రామకృష్ణ.
Read Also: Krishna Water Colour Change: మారుతున్న కృష్ణాజలాల రంగు.. ఆందోళనలో బెజవాడ జనం

Show comments