NTV Telugu Site icon

GHMC: అసంపూర్తిగా ముగిసిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం

Ghmc

Ghmc

GHMC: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. సమావేశం ప్రారంభంలోనే అడ్డుకునేందుకు బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also: CM Revanth Reddy: నల్లమలలో పెరిగిన పులులు, తోడేళ్లు చూశా.. మీ కుట్రలు ఎంత?

Show comments