GHMC Council : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
- GHMC కౌన్సిల్ సమావేశం
- సమస్యలపై మేయర్, కమిషనర్‌ను నిలదీసిన కార్పొరేటర్లు
- సమస్యల పరిష్కారానికి టైం లిమిట్ పెట్టాలని BJP, MIM డిమాండ్
- ప్రధానంగా చెత్త, స్ట్రీట్ లైట్ల సమస్యపై చర్యలు తీసుకోవాలన్న కార్పొరేటర్లు
- కార్పొరేట్ స్కూల్స్ సరిగా ట్యాక్స్‌లు కట్టలేదన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Council : జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్‌తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వెళ్లగా, కాంగ్రెస్ (Congress) కార్పొరేటర్లు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి (C.N. Reddy), బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) బీఆర్ఎస్ సభ్యుల నుండి ప్లకార్డులను లాక్కొని చించేశారు. దాంతో, రెండు పార్టీల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాటకు దారి తీసింది.
Also Read
కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసరడంతో మార్షల్స్ హస్తక్షేపం చేశారు. మార్షల్స్ హాల్లోకి ప్రవేశించి, తీవ్రంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేదని, గ్రేటర్ హైదరాబాద్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు.
ఇదే సమయంలో, బీజేపీ నేతలు కూడా ఈ గందరగోళంపై స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, సమావేశాన్ని సజావుగా నడవనీయకుండా ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించాలనే డిమాండ్ చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకోవడం వెనుక రాజకీయం ఉందని కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతల నడుమ గందరగోళ పరిస్థితుల్లో కొనసాగింది. మార్షల్స్ జోక్యంతో కొంత అదుపులోకి వచ్చినా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నిరసనను ఉధృతం చేయనున్నట్లు సంకేతాలు ఇవ్వగా, కాంగ్రెస్ నేతలు వారిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు, బీజేపీ ఈ తతంగాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఒకే గొడుగు కింద ఉన్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఈ ఘటనతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ముద్ర వేసిన ఈ సంఘటన మరిన్ని రాజకీయ విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది.
MLC Kavitha : కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి
తాజావార్తలు
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!