Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ఎంత కష్టమో.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాక మళ్లీ పునరాగమనం చేయడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. డ్రాప్ అయిన విషయం తెలిసి మైదానంలో ఆ కుర్రాడు తీవ్ర నిరాశతో కనిపించిన విజువల్స్ వైరల్ కావడంతో.. టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరుపై మాజీ ఆటగాళ్లు అంబటి రాయుడు, సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనీ స్పోర్ట్స్ ఛానెల్లో జరిగిన చర్చలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ లోపాన్ని ఎత్తిచూపాడు. “వైభవ్ సూర్యవంశీ హావభావాలు చూస్తుంటే.. తను ఈ మ్యాచ్ ఆడటం లేదనే విషయాన్ని మేనేజ్మెంట్ కనీసం ముందు రోజు రాత్రి కూడా అతనికి చెప్పలేదనిపిస్తోంది. సంజు శామ్సన్ను ఆడించాలనే నిర్ణయం బహుశా టాస్ వేసే రోజే తీసుకుని ఉంటారు. జట్టులో ఇలాంటి విషయాల్లో స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. యువ ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి పడకుండా, వారి చుట్టూ ఎల్లప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా జరిగింది. రాబోయే 20-25 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవ చేయగల అద్భుతమైన ప్రతిభ ఉన్న 15 ఏళ్ల కుర్రాడిని మేనేజ్మెంట్ సరిగ్గా ప్రొటెక్ట్ (సంరక్షించడం) చేయడం లేదని నాకు అనిపిస్తోంది. ఇంతటి అద్భుతమైన కిడ్‌ను మనం నిర్లక్ష్యం చేయకూడదు, అతనిపై మరికొంత శ్రద్ధ పెట్టాలి” అని రాయుడు ఘాటుగా వ్యాఖ్యానించాడు.
Also Read
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ఇక భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఈ నిర్ణయంతో పూర్తిగా విభేదించారు. మ్యాచ్‌కు ముందు గవాస్కర్ అంచనా ప్రకారం.. శామ్సన్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ చేసి, వైభవ్ సూర్యవంశీ మూడో స్థానంలో వస్తాడని భావించారు. కానీ మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌ను కాదని వైభవ్‌నే పక్కన పెట్టింది. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ.. “సంజు శామ్సన్ను జట్టులోకి తీసుకోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వైభవ్ నడుచుకుంటూ వెళ్తున్న తీరు చూడండి.. ఎంతగా నిరాశ చెందాడో స్పష్టంగా తెలుస్తోంది. అప్పటికే సిరీస్ చేజారిపోయిన నేపథ్యంలో.. ఆ కుర్రాడికి మరో అవకాశం ఇచ్చి, గత తప్పుల నుంచి ఏమైనా నేర్చుకున్నాడో లేదో చూడాల్సింది. ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను హుక్ షాట్ ఆడుతూనే అవుట్ అయ్యాడు. కానీ, ఆ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాట్ మధ్యలోంచి కొట్టిన రెండు అద్భుతమైన సిక్సర్లు అతనిలోని ప్రతిభను చూపించాయి. ఎక్కడా ఎడ్జ్ అవ్వలేదు. అతనిలో అపారమైన పొటెన్షియల్ ఉంది. ఒకవేళ ఇది సిరీస్ డిసైడర్ మ్యాచ్ (2-2) అయ్యుంటే సీనియర్లకు అవకాశం ఇవ్వడాన్ని నేను అర్థం చేసుకునేవాడిని. కానీ ఇది ప్రయోగాలకు అనుకూలమైన మ్యాచ్, ఇక్కడ అతనికి మరో అవకాశం ఇవ్వాల్సింది. ఇప్పటికైనా ఎవరైనా సీనియర్ ఆటగాడు అతని భుజంపై చేయి వేసి.. ‘ఇక్కడితో అంతా అయిపోలేదు’ అని ధైర్యం చెప్పాలని ఆశిస్తున్నాను. కేవలం మూడు మ్యాచుల తర్వాత ఒక 15 ఏళ్ల కుర్రాడిని ఇలా డ్రాప్ చేయడం చాలా కఠినమైన నిర్ణయం” అని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?