Ganja Smuggling : షాద్ నగర్ లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది.. తీగ లాగితే డొంక కదిలినట్టు తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ అయిన గంజాయిని బయటికి తీసి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దీనిని తన బంధువు ద్వారా విక్రయించేతువు తీసుకు వెళుతుండగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4వ తేదీన పట్టణంలోని ఫరూక్ నగర్ యాదవ కాలనీ ఈద్గా వద్ద స్థానిక ఎస్సై దేవరాజ్ వాహనాల తనకి చేస్తుండగా అంజద్ (32) అనే యువకుడు చేతిలో కవర్ తీసుకొని అనుమానాస్పదంగా వెళుతుండగా పోలీసులు అతని వద్ద సోదా చేశారు. చేతి కవర్ లో గంజాయి వాసనను పసిగట్టి ఎస్సై దేవరాజ్ తదితర సిబ్బంది అతని అదుపులోకి తీసుకున్నారనీ సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు.
RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..
వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గులాం సుల్తాన్ అహ్మద్ (52) సీజ్ చేసి ఉంచిన గంజాయిని బయటకు తీసి తన వరుసకు కుమారుడైన అంజద్ కు అమ్మాలని అందజేశాడనీ పోలీసులు పేర్కొన్నారు. ఈ గంజాయిని అమ్మే క్రమంలో అంజాత్ షాద్ నగర్ పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. కంచె చేను మేసిన చందంగా తప్పుచేసి ఇరుక్కున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్, అంజద్ ఇరువురులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 75 వేల విలువగల ఈ గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని తన వరుసకు బాబాయి అయిన గులాం సుల్తాన్ అహ్మద్ తో కలిసి గంజాయి విక్రయాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసును శంషాబాద్ డిసిపి రాజేష్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై దేవరాజును అభినందిస్తూ వారికి తగిన రివార్డు కోసం పై అధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని సిఐ విజయకుమార్ తెలిపారు..
Physical Harassment : వికారాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి..!