Atiq Ahmed : ఆమె శాపం వల్లే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చంపబడ్డాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atiq Ahmed : గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లో వైద్య చికిత్స కోసం తీసుకువెళుతుండగా దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనను 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనగా పేర్కొంటున్నారు. నవవధువు చేతికి గోరింటాకు కూడా పోకముందే తన భర్తను కడతేర్చిన దుర్మార్గులకు మహిళ శాపం పెట్టింది. పెళ్లయిన తొమ్మిదో రోజు తన కంటిమీద కునుకు లేకుండా చేసిన వాడి పాపం పండుతుందని ఆగ్రహించింది. ఈ మహిళ ఎవరు..ఎవరి శాపం అతిక్ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసింది.
మూడు రోజుల్లో అతిక్ కుటుంబంలోని ముగ్గురిని మట్టిలో కలిపేసింది. తొలుత అతిక్ కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. రెండు రోజుల తర్వాత అతిక్, అతని సోదరుడు పోలీసుల ముందే కాల్చి చంపబడ్డారు. శనివారం అర్థరాత్రి జరిగిన మారణకాండకు 18 ఏళ్ల క్రితం జరిగిన ఘటనతో ముడిపడి ఉంది. ఒక మహిళ శాపం అతిక్, అతని అనుచరులు అదే విధిని ఎదుర్కొన్నారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
Read Also: YS Viveka Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి.. విచారణపై ఉత్కంఠ
ఆ మహిళ పేరు పూజా పాల్, మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ భార్య. ఈ ఘటన 2004లో జరిగింది. అతిక్ అహ్మద్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రయాగ్‌రాజ్ నుంచి గెలుపొందారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్ పశ్చిమ విధానసభ ఉప ఎన్నిక జరిగింది. 2005లో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అతిక్ తన సోదరుడు అష్రఫ్‌ను రంగంలోకి దించాడు. బీఎస్పీ టికెట్‌పై రాజుపాల్ పోటీ చేశారు. అతిక్ కుటుంబం ఓటమి చవిచూడటం అదే తొలిసారి. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే రాజు పాల్‌కి పూజతో వివాహం జరిగింది. ఎమ్మెల్యే అయ్యి పెళ్లి చేసుకున్న రాజు రెట్టింపు ఆనందాన్ని అతిక్ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. రాజు పాల్‌ని చంపే పనిని అతిక్ సోదరుడు అష్రఫ్‌కి అప్పగిస్తాడు.
జనవరి 25, 2005న, ధూమన్‌గంజ్‌లో ఎమ్మెల్యే రాజుపాల్ చంపబడ్డారు. రాజు పాల్‌ని కిడ్నాప్ చేసి చంపినప్పుడు ప్రయాగ్‌రాజ్ మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. పెళ్లయిన తొమ్మిదో రోజే భర్త హత్యకు గురయ్యాడని పూజా పాల్ ఆవేదన చెందింది. ఏదో ఒకరోజు నువ్వు నా భర్తలా కుక్క చావు చస్తావని అతిక్ ను శపించింది. ఈ శాపం చివరికి తన కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తుందని అతిక్ కలలో కూడా ఊహించలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత మూడు రోజుల్లో, అతిక్ కుటుంబానికి శాపం తగిలింది. ఇద్దరు మైనర్లు జైలులో ఉన్నారు. భార్య షాహిస్తా పరారీలో ఉంది. కొడుకు ఎన్‌కౌంటర్ రెండు రోజుల క్రితం జరగగా, అతిక్ మరియు అతని సోదరకుడు కాల్చి చంపబడ్డారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!