Delhi: తీహార్ జైలులో గ్యాంగ్ వార్.. ఖైదీని కత్తితో పొడిచిన ప్రత్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ వార్ ఘటన వెలుగు చూసింది. ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Modi – Akira Nandan: అకిరా నందన్ ను మోడీకి పరిచయం చేసిన పవన్!
Also Read
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. “బుధవారం తీహార్ జైలు నుండి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు హరినగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని తెలిపారు. దీంతో.. స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీసినట్లు” డిప్యూటీ పోలీస్ కమిషనర్ (పశ్చిమ) విచిత్ర వీర్ పేర్కొన్నారు. “హితేష్‌పై దాడి చేసినది గౌరవ్ లోహ్రా, గురిందర్గా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: YS Jagan: రక్షణ లేకుండా పోయింది.. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకొండి..!
హితేష్ 2019 నుండి జైలులో ఖైదీగా ఉంటున్నాడు. కాగా.. కత్తితో దాడి చేసిన నిందితులు గౌరవ్, గురిందర్ పై హత్య మరియు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ఘటనపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే.. గత ఏడాది మేలో తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠాలోని పలువురు సభ్యులు కత్తితో పొడిచి చంపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!