తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.