NTV Telugu Site icon

Delhi: తీహార్ జైలులో గ్యాంగ్ వార్.. ఖైదీని కత్తితో పొడిచిన ప్రత్యర్థులు

Gang War

Gang War

రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ వార్ ఘటన వెలుగు చూసింది. ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Modi – Akira Nandan: అకిరా నందన్ ను మోడీకి పరిచయం చేసిన పవన్!

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. “బుధవారం తీహార్ జైలు నుండి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు హరినగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని తెలిపారు. దీంతో.. స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీసినట్లు” డిప్యూటీ పోలీస్ కమిషనర్ (పశ్చిమ) విచిత్ర వీర్ పేర్కొన్నారు. “హితేష్‌పై దాడి చేసినది గౌరవ్ లోహ్రా, గురిందర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: YS Jagan: రక్షణ లేకుండా పోయింది.. గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకొండి..!

హితేష్ 2019 నుండి జైలులో ఖైదీగా ఉంటున్నాడు. కాగా.. కత్తితో దాడి చేసిన నిందితులు గౌరవ్, గురిందర్ పై హత్య మరియు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ఘటనపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే.. గత ఏడాది మేలో తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠాలోని పలువురు సభ్యులు కత్తితో పొడిచి చంపారు.