హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 11 రోజులుగా పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయం ప్రారంభమైంది. ఖైరతాబాద్ శోభాయాత్ర షెడ్యూల్ కంటే ముందే ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో తొలిసారిగా 12 గంటల్లో నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. మహాగణపతి ఉదయం 11 గంటలకు క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలిన వినాయకుల నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు. మరోవైపు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కు భారీగా భక్తులు చేరుకుంటున్నారు.
Also Read : CM Jagan : ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
ఈ క్రమంలో ఖైరతాబాద్ లో మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నంబర్ 4 దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గతంలో జంటనగరాల్లో గణేశ నిమజ్జనం అనంతరం చివర్‌లో ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఖైరతాబాద్ ఊరేగింపులో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నిమజ్జనం పూర్తవుతుందని వెల్లడించారు. నగరంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఉన్నారని ఆయన తెలిపారు.
Also Read : Skanda 2: సీక్వెల్ కి సిద్ధం… బోయపాటి మాస్ ఇది