మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. ఆ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారారు.. అయితే ప్రస్తుతం రాంచరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.రాం చరణ్ ను మళ్ళీ వెండి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.కాని గేమ్ చేంజర్ సినిమా విడుదల పై దర్శకుడు శంకర్ క్లారిటీ ఇవ్వడం లేదు.. పోనీ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా చరణ్ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అంటే అది కూడా లేదు. దాంతో రాంచరణ్ ఫ్యాన్స్ డైరెక్టర్ శంకర్ పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ తాజాగా మైసూర్ లో షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా.. ఓటు వేయడానికి చరణ్ హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారు. అయితే శంకర్ అటు భారతీయుడు2 షూటింగ్ కోసం గేమ్ ఛేంజర్ సినిమాను కాస్త ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది.. దాంతో చరణ్ ప్యాన్స్ శంకర్ మీద కాస్త కోపంగా వున్నారు..ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ విషయంలో మొన్నటి వరకూ ఎలా ఉన్నా కానీ తాజాగా దర్శకుడు శంకర్ కు డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో తన తరువాత సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి.. దాంతో వచ్చే ఏడాది మార్చి వరకూ శంకర్ కు టైమ్ ఇచ్చారట రాంచరణ్… అంతే కాదు ఫ్యాన్స్ కోసం సాలిడ్ అప్ డేట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ కూడా మేజర్ షూటింగ్ అంతా అయిపోయిందని తెలుస్తుంది.ఇక ఈ నెలలో ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసి మిగతా ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే తరువాత నెలలో ప్లాన్ చేయనున్నట్లు సమాచారం