మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.ఆ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు.ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం రాం చరణ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శంకర్ మొన్నటి వరకు కమల్ హాసన్ హీరో గా తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా తో బిజీ గా వున్నారు దీనితో గేమ్ చేంజర్ షూటింగ్ హోల్డ్ లో పడింది.. రీసెంట్ గా రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ మళ్ళీ స్టార్ట్ అయింది.అయితే ఈ సినిమాలోని సీన్ కు సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ భువనగిరి మండలంలోని భీమరావ్ పల్లెలో జరుగుతుండగా రామ్ చరణ్ పాత్ర కల్తీ బియ్యాన్ని పట్టుకునే సన్నివేశాన్ని షూట్ చేశారని సమాచారం.. చరణ్ ఆఫీసర్ లుక్ లో కనిపిస్తారని చరణ్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉండనుందని సమాచారం.. గేమ్ ఛేంజర్ సినిమాతో రాం చరణ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.దర్శకుడు శంకర్ ఈ సినిమాలోని సాంగ్స్ కోసమే 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.. ఖర్చు విషయంలో శంకర్ రాజీ పడటం లేదని ప్రతి సీన్ ను కూడా భారీ లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.తన సినీ కెరీర్ లోనే భారీ లాభాలను అందించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం.. అయితే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నుంచి లీక్డ్ పిక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ సినిమా నుంచి లీక్స్ జరుగుతూ సినిమా యూనిట్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ లీక్స్ చూసాక చిత్ర యూనిట్ షూటింగ్ లో ఎలాంటి నిబంధనలు విధిస్తుందో చూడాలి.