విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS -2 లో లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్పందించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ప్రమాద విషయాన్ని ఎంపీ విజయ్ సాయి రెడ్డి, సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళాం అన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ముంబైలో వైద్యం అందించాలని కోరాం. కాంట్రాక్టు ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగి అన్న తేడా లేకుండా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తాం అన్నారు.
Read Also: lithium: జమ్మూలో భారీగా లిథియం నిల్వలు … మన భవిష్యత్ మార్చేస్తుందా? ఉపయోగాలేమిటి..?
ప్రతి కార్మికునికి అండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. కేంద్రం ఎప్పుడో ప్రైవేటీకరిస్తామని ఇప్పటి నుంచే రిక్రూట్మెంట్ నిలిపివేయడం దారుణం అన్నారు. అసలు ప్రైవేటీకరణ జరుగుతుందా. ? ఇలాంటి ప్రమాదాలకు పని ఒత్తిడి కూడా ఓ కారణం అన్నారు. నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకువెళ్లాలని కార్మికులు ఒత్తిడికి గురవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి స్టీల్ ఉన్నతాధికారి వరకు ఢిల్లీ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాల కోసం ఒత్తిడి తీసుకువస్తాం అన్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈ ప్రమాదంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
Read Also: Mangalagiri Lakshmi Narasimha Swamy: వివాదాలకు కేంద్ర బిందువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం