G20 Food Festival: టేస్ట్ ది వరల్డ్.. ఢిల్లీలో 2-రోజుల పాటు జీ20 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Food Festival: న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్‌ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం ప్రారంభించారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ థీమ్‌ను ‘టేస్ట్ ది వరల్డ్’ అంటూ ప్రకటించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ నాలుగు జీ20 దేశాలు చైనా, టర్కీ, జపాన్, మెక్సికోలు పాల్గొంటున్నాయి. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఇది ఎన్‌డీఎంసీ జీ20 ఫుడ్ ఫెస్టివల్ మాత్రమే కాదు, దేశానికి ఫుడ్ ఫెస్టివల్ కూడా అని అన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోజువారీ ఆహార పదార్థాలలో మిల్లెట్లను చేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. మిల్లెట్‌లతో తయారు చేసిన రెడీ-టు-ఈట్ వంటకాలు, స్నాక్స్ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ప్రపంచ ఆహార ప్రియులు ఈ ఫెస్టివల్ ఏకం అవుతారని కేంద్రమంత్రి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భారత్‌లోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన వంటకాలను రుచి చూడవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన వంటకాలు ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో లభిస్తాయని చెప్పారు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Ravindra Jadeja: జడేజాకు షాకిచ్చిన ఐసీసీ.. ఆ పని చేసినందుకు!
తాజ్ ప్యాలెస్, తాజ్ మహల్, ది కన్నాట్, తాజ్ అంబాసిడర్స్, లే మెరిడియన్, ఐటీసీ మౌర్య, ది పార్క్ సహా 11కి పైగా ప్రముఖ హోటళ్లు ఈ కార్యక్రమంలో తమ సంతకంతో కూడిన ఆహార పదార్థాలను అందజేయనున్నాయి. ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’ థీమ్‌పై వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఫుడ్ ఫెస్టివల్‌లో ఎనిమిది స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది. తీహార్ బేకింగ్ స్కూల్‌తో పాటు ఢిల్లీ జైలు విభాగం కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటోంది. ఎన్‌ఎండీసీ పాల్గొనే వారందరికీ స్టాల్ కోసం స్థలం, మద్దతును అందిస్తోంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ జీ20 సమ్మిట్‌కు భారత్ అధ్యక్షత వహించడం, అంతర్జాతీయ వంటకాల గురించి అవగాహన కలిగిస్తుందని ఎన్‌ఎండీసీ పేర్కొంది.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!