Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story From Kangana Ranaut To Arun Govil Many Celebrities In New Parliament

Celebrities: కంగనా రనౌత్ నుండి అరుణ్ గోవిల్ వరకు.. పార్లమెంటులో అడుగుపెట్టే సినీ ప్రముఖులు వీళ్లే

Published Date :June 5, 2024 , 6:17 pm
By Rajesh Veeramalla
Celebrities: కంగనా రనౌత్ నుండి అరుణ్ గోవిల్ వరకు.. పార్లమెంటులో అడుగుపెట్టే సినీ ప్రముఖులు వీళ్లే
  • Follow Us :
  • google news
  • dailyhunt

2024 ఎన్నికల్లో విజయం సాధించి.. తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెడుతున్న సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందులో కంగనా రనౌత్ నుండి అరుణ్ గోవిల్ వంటి ప్రముఖులు మొదటి సారిగా 18వ లోక్‌సభలో కాలుమోపనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దేశంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈసారి జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించి పార్లమెంటులోకి రావడానికి సిద్ధమయ్యారు.

Read Also: Germany floods: జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. ఐదుగురు మృతి

కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టే సినీ ప్రముఖులు ఎవరంటే..
కంగనా రనౌత్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలాకాలం నుంచి మద్దతు తెలిపింది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం ఆమెకు తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి పోటీ చేసే అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని కంగనా సద్వినియోగం చేసుకుంది. మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌పై కంగనా రనౌత్ విజయం సాధించింది.

Read Also: Annamalai: తమిళనాడులో బీజేపీ ఫలితాలపై అన్నామలై కీలక వ్యాఖ్యలు..

“రామాయణ్” స్టార్ అరుణ్ గోవిల్ కూడా బీజేపీ నుంచి పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సునీతా యాదవ్‌పై ఆయన విజయం సాధించారు. అయితే.. ఆయన కేవలం 10,585 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో ప్రముఖ నటి హేమ మాలిని.. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్‌గర్‌పై మథుర నుండి లోక్‌సభకు నేరుగా మూడవసారి ఎన్నికయ్యారు. మరోవైపు.. మాజీ భోజ్‌పురి సినీ నటుడు, గాయకుడు మనోజ్ తివారీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుండి బీజేపీ తరుఫున పోటీ చేసి కాంగ్రెస్ ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌పై గెలుపొందారు. ఈ స్థానం నుంచి తివారీకి ఇది వరుసగా మూడో విజయం. 18వ లోక్‌సభ ఎన్నికలకు ఢిల్లీ నుంచి బీజేపీ నిలబెట్టుకున్న ఏకైక సిట్టింగ్ ఎంపీ ఈయనే.

Mahesh Babu: బాబు, పవన్ గెలుపు.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్లు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుండి మరో ప్రముఖ భోజ్‌పురి సినీ నటుడు, బీజేపీ అభ్యర్థి రవి కిషన్ వరుసగా రెండవసారి గెలుపొందారు. తన నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ నుంచి కాజల్ నిషాద్‌ను ఓడించారు. కేరళలోని త్రిసూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటుడు సురేష్ గోపి గెలుపొందారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన విఎస్ సునీల్‌కుమార్‌ను ఓడించారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఎస్‌ఎస్ అహ్లువాలియాపై విజయం సాధించారు.

Top Universities In World: ప్రపంచ టాప్ యూనివర్సిటీల్లో భారత ఐఐటీలు..

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో మాజీ నటి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరిలాల్ శర్మ చేతిలో విజయం సాధించలేకపోయింది. నటుడు, బీజేపీ నాయకుడు దినేష్ లాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ సీటులో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ పై గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అసెంబ్లీ స్థానంలో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగగీతపై విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్‌లో టిఎంసికి చెందిన బెంగాలీ నటుడు, రాజకీయవేత్త జూన్ మాలియా బిజెపికి చెందిన అగ్నిమిత్ర పాల్‌పై విజయం సాధించారు. నటి, టిఎంసి అభ్యర్థి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి బిజెపికి చెందిన నటుడు లాకెట్ ఛటర్జీపై విజయం సాధించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arun Govil
  • Celebrities
  • Kangana Ranaut
  • Parliament
  • telugu news

తాజావార్తలు

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Honey Rose : సెల్ఫీ ఇస్తుండగా హీరోయిన్’ను అక్కడ పట్టుకున్న అభిమాని

  • KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్‌’లు ఉన్న ట్రక్కు చోరీ..

  • CCTV Ban: కీలక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఆ సీసీటీవీలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

ట్రెండింగ్‌

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions