గుజరాత్‌లో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిను ఇష్టపడ్డారు. ఇది ఒకరికి రుచించలేదు. అంతే అడ్డుగా ఉన్న స్నేహితుడిని అంతమొందించాడు. ఈ ఘటన నఖత్రానాలోని మురు గ్రామంలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. రికార్డ్ స్థాయిలో సిల్వర్ ధర
రమేష్-కిషోర్ ఇద్దరు స్నేహితులు. అయితే రమేష్ ఒక అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కిషోర్ తనతో కూడా సంబంధం పెట్టుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో కోరాడు. అయితే ఈ విషయాన్ని రమేష్‌కు తెలియజేసింది. కోపోద్రేకుడైన రమేష్.. కిషోర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించాడు. కిషోర్ మనస్తాపం చెందాడు. రమేష్‌ను ఎలాగైనా అంతమొందించాలని కుట్ర పన్నాడు. డిసెంబర్ 2న రమేష్‌ను బయటకు తీసుకెళ్లి చంపేశాడు. శరీరాన్ని ముక్కలు.. ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు.
ఇది కూడా చదవండి: H-1B Visa: భారతీయులకు షాక్.. హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత
అయితే డిసెంబర్ 2 నుంచి రమేష్ ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా స్నేహితుడు కిషోర్‌పై అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చోటుకు తీసుకెళ్లి వెలికితీశారు. బోరు బావి నుంచి తెగిపోయిన భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మైనర్ బాలుడిని కూడా అరెస్ట్ చేశారు. మహిళ విషయంలో జరిగిన ఘర్షణ తర్వాత రమేష్‌ను చంపేసినట్లు కిషోర్ ఒప్పుకున్నాడు. నిందితుడి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.