Annie Ernaux: ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ బహుమతిని ప్రకటించగా.. తాజాగా సాహిత్య రంగానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఫ్రాన్స్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌ను నోబెల్ పురస్కారం వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ గురువారం సాయంత్రం ఓ కీలక ప్రకటన చేసింది. ‘ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్ అక్యూటీ…’ పేరిట రాసిన పుస్తకానికి గాను ఆమెకు నోబెల్ బహుమతి దక్కింది. 1974లోనే రచనలు మొదలుపెట్టిన ఎర్నాక్స్ ఈ ఏడాది తన 82 ఏట నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. అనీ ఎర్నాక్స్ 1974లోనే రచనలు మొదలు పెట్టారు. ఆమె తన 82వ ఏట నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. సాహిత్యంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎర్నాక్స్.. ప్రధానంగా ఆటో బయోగ్రఫీలు రాశారు. తన తల్లిదండ్రులతో తన అనుబంధం, తదనంతరం తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా ఎన్నో రచనలు చేశారు.
లింగం, భాష, వర్గం అంశాలపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ చేసే రచనలతో ఆమె పేర్గాంచారు. 1940లో నార్మాండీలోని యెవెటోట్ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడుపుతోన్న ఎర్నాక్స్ రచయిత్రి వైపు సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది. అత్యంత ధైర్యం, కచ్చితత్వంతో వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలపై చేసిన కృషికి గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ఆమె 30కి పైగా సాహిత్య రచనలు చేశారు.
Read Also: Facebook : ఫేస్ బుక్ లో 12 వేల మంది ఉద్యోగుల పై వేటు?
గత కొన్నేళ్లుగా నోబెల్ పురస్కారం ఎర్నాక్స్‌కు వస్తుందంటూ ఊహాగానాలు వినిపించేవి. ఎట్టకేలకు ఆ ఊహగానాలు నిజమయ్యాయి. ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రాలతో పాటు సాహిత్య నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థికరంగం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. 82 ఏళ్ళ ఎర్నాక్స్ 1974 లో రచనలు చేయడం ప్రారంభించారు. మొదట ఆమె ఫిక్షన్ నవలలనే రాసినప్పటికీ తరువాత కాలంలో ప్రధానంగా ఆటోబయోగ్రఫీలు రాశారు. 1974లో ‘లెస్ ఆర్మోయిర్స్ వైడ్స్’, 1990లో ‘క్లీన్డ్ అవుట్’ అనే రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో గొప్ప స్థానం కల్పించాయి. ఆమె 300కి పైగా రచనలు చేశారు. 1901 నుంచి ఇప్పటి వరకు సాహిత్యంలో 119 మందికి నోబెల్ బహుమతులు దక్కగా అందులో , ఈ రోజు నోబెల్ బహుమతి సాధించిన ఎర్నాక్స్ తో కలిపి 17 మంది మహిళలు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ సుమారు 9లక్షల డాలర్లు నగదు అందజేస్తారు.