Cyber Crime: ఆన్‌లైన్ మోసాల సంఘటనలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో టవల్స్ ఆర్డర్ చేసిన మహిళ ఖాతా నుంచి రూ.ఎనిమిది లక్షలు మాయమయ్యాయి. సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేసేందుకు.. డబ్బును దొంగిలించడానికి ఎల్లప్పుడూ కొత్త మార్గాలను వెతుకుతున్నారు. UPI నుండి SMS మోసానికి సంబంధించిన అనేక కేసులు ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలు ఆన్‌లైన్‌లో టవల్స్ ఆర్డర్ చేస్తూ మోసపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహిళను రూ.8.3 లక్షలు మోసం చేశారు. ఈ ఆన్‌లైన్ మోసం ప్రజలను షాక్‌కు గురి చేసింది.
Read Also: Hit & Run Case: తార్నాకలో హిట్ & రన్.. ఆటోని ఢీకొన్న బెంజ్ కారు.. యజమాని పరార్
ముంబైలోని మీరారోడ్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఈ-కామర్స్ సైట్‌లో రూ.1,160కి ఆరు టవల్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తుండగా ఆమె ఖాతా నుంచి రూ.1169కి బదులు రూ.19,005 కట్ అయింది. మహిళ ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సహాయం కోసం బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసింది. కానీ బ్యాంకును సంప్రదించ లేకపోయింది. కొద్దిసేపటికే ఆమెకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. బ్యాంక్ నుండి చేస్తున్నట్లు చెప్పుకున్నారు.
Read Also: Uncontrolled Car : అతివేగంగా వెళ్లి స్థంభాన్ని ఢీకొట్టి.. బాంబులా పేలిన కారు
ఆన్‌లైన్ లావాదేవీ సమస్యతో ఆమెకు సహాయం చేస్తామన్నారు. రీఫండ్ కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని ఆ వ్యక్తి ఆమెకు సూచించాడు. మహిళ సహాయం కోసం వ్యక్తి ఇచ్చిన అన్ని సూచనలను అనుసరించింది.. అయితే అప్పటికే ఆమె ఖాతా నుంచి రూ.1 లక్ష డెబిట్ చేయబడింది. ఇది చూసిన మహిళ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అయితే ఇంతలోనే ఆమె ఖాతా నుంచి మరో రూ.8.3 లక్షలు డ్రా అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.