Parchur: ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్.. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారులపై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parchur: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.. నలుగురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదుతో విచారణ జరిపిన ఎన్నికల కమిషన్.. బాపట్ల ఎస్పీ నివేదికతో చర్యలకు పూనుకుంది.. ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉందని నిరూపితం కావడంతో.. మార్టూరు సీఐ, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి ఎస్సైలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఈవో ముకేశ్ కుమార్ మీనా.. ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉన్న బీఎల్ఓలు, మహిళా పోలీసులపైనా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.. ఆగస్టు నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్యే సాంబశివరావు ఫిర్యాదు చేశారు.. ఇప్పుడు అధికారులపై తీసుకున్న చర్యలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు సీఈవో మీనా..
Read Also: Pooja Hegde : ఖరీదైన కారు కొన్న బుట్టబొమ్మ.. ధర ఎంతో తెలుసా?
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
కాగా.. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కుట్ర జరిగిందని.. ఈ కుట్రలో 189 మంది భాగస్వాములయ్యారని, 1,200 మంది సహాయ సహకారాలు అందించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించిన విషయం విదితమే.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఈఓ, ఈఆర్వోలంతా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని.. ఈ కుట్రలో అధికారులూ భాగస్వాములే అని ఆయన దుయ్యబట్టిన విషయం విదితమే.. ఇక, ఏపీ వ్యాప్తంగా 2.45 లక్షల ఫారం-7 దరఖాస్తులు, 1.20 లక్షల కొత్త ఓటరు దరఖాస్తుల్ని చేయించారని.. ఒక్క పర్చూరు నియోజకవర్గంలో ఇలా 25 వేల మంది ఓట్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు.. దీన్ని అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని పదేపదే కోరినా.. స్పందించడంలేదని విమర్శించారు.. ఇక, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు మండలాల ఎస్సైలతోపాటు మార్టూరు సీఐ కూడా ఫారం-7 దరఖాస్తుల్ని పెట్టడంలో ఒత్తిడి తెచ్చారని సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఆయన మీడియాకు వివరించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధితులపై చర్యలు తీసుకుంది.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!