Cubs Looks Viral: అడవికి రాజు సింహం. ఈ జంతువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ప్రమాదకరమైన జీవులు. అయితే వీటిని చూడాలంటే అడవుల్లోకి లేకపోతే ఎక్కడైనా జంతుప్రదర్శనలో మాత్రమే ఇవి కనపడతాయి. ఇకపోతే తాజాగా దక్షిణాఫ్రికాలోని మలమల గేమ్ రిజర్వ్ లో నాలుగు సింహం పిల్లల వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. అంతా గప్ చుప్!
ఇంస్టాగ్రామ్ లో మలమల గేమ్ రిజర్వు పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మొదట్లో రెండు సింహం పిల్లలు అవి ఉండే గుహ బయట ఓ రాయిపై కూర్చుని ఉన్నట్లు కనపడుతుంది. అలా కొన్ని క్షణాల తర్వాత వాటి దగ్గరికి., గుహ దగ్గర నుంచి మరో రెండు సింహం పిల్లలు కూడా చేరుతాయి. అలా ఆ రెండు బయటికి వచ్చిన తర్వాత కొన్ని క్షణాల పాటు మూడు సింహం పిల్లలు సంతోషంగా ఆడుకున్నట్లు కనపడుతుంది. మరో సింహం పిల్ల మాత్రం.. బిజీగా మరోవైపు చూస్తున్నట్లు కనపడుతుంది. చివర్లో ఈ సింహం పిల్లలు అన్ని ఒకే వైపు చూడటం ఇప్పుడు వైరల్ గా మారింది.
Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ట్రిపుల్ ఇస్మార్ట్?
ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు నేను చూసిన వీడియోలలో అద్భుతమైన వీడియో అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో., ” క్యూట్ నెస్ ఫ్రీక్ ఓవర్ లోడ్ ” అంటూ వారి ఆనందాన్ని తెలుపుతున్నారు. ఇక మరికొందరైతే.. మీరందరూ బయటకు వచ్చారు, మీతో పాటు అమ్మను పీల్చుకోచుకోవాలని తెలియదా అంటూ.. ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.