మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.