NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. ఇది చంద్రబాబు, పవన్ చేసిన పాపమే..!

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన పాపమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి‌.‌‌. తిరుపతిలోమీడియాతో మాట్లాడిన ఆయన.. గోవులు దేవుళ్లతో సమానం.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయి.. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది గోమాత‌.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా.. పట్టించుకోకుండా ఉన్నారు.. ఎస్వీ గోశాలలో గోవులను దుస్థితి దారుణంగా ఉంది. వందకు పైగా ఆవులు చనిపోయాయి.. ఆ లెక్కలు, ఆవుల మృతి బయటకు రాకుండా చూశారు.. కనీసం పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ మహాపాపం టీటీడీది, ప్రభుత్వానిది కాదా ? అని నిలదీశారు.

Read Also: Allahabad High Court: టీషర్ట్తో కోర్టుకు హాజరైన లాయర్.. 6 నెలల జైలు శిక్ష విధించిన జడ్జి

గోశాలపై పర్యవేక్షణలో అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితికి కారణం అన్నారు కరుణాకర్‌రెడ్డి.. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. ఎస్వీ గోశాల నుండి తిరుమలకు పాలు వెళ్తాయి.. స్వామి వారికి నైవేద్యంగా వెన్న ఇక్కడ నుండి ఇస్తారు.. వైసీపీ పాలనలో గుజరాత్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల నుండి ఆవులను తీసుకోచ్చి స్వామి వారి సేవలు అందించాం.. 580 ఆవులను మా ప్రభుత్వంలో తీసుకొచ్చాం… వైసిపి పాలనలో 1500 లీటర్ల పాలు తిరుమలకు రోజు అందించాం.. ఇప్పుడు కూటమీ ప్రభుత్వం ఐదు వందల లీటర్ల పాలు తిరుమలకు వెళ్లడం లేదని విమర్శించారు.. అయితే, పవన్ కల్యాణ్, చంద్రబాబు.. జగన్ పై అసత్య ప్రచారం చేశారు.. కానీ, హిందు ధర్మాన్ని కాపాడింది జగన్‌‌.. కూటమీ ప్రభుత్వం టిటిడి ఎస్వీ గోశాలనే రక్షించలేకపోయారు.. అక్కడి అధికారుల నిర్లక్ష్యంతోనే గోవులను చనిపోయాయి… ఇప్పటి వరకు టీటీడీ జేఈవో, సీవీ ఎస్వీ సహా ఇతర అధికారులను నియమించలేదు… తొక్కిసలాట ఘటనలో ఏమాత్రం సంబంధం లేని ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాధ్ రెడ్డి కావాలనే సస్పెండ్ చేసి.. ఇప్పుడు గోవుల మృతికి చంద్రబాబు కారణం అయ్యారని దుయ్యబట్టారు..

Read Also: Gold Rate Today: నిన్న రూ.2940, నేడు రూ.2020.. ఇక బంగారం కొనడం కష్టమేనా?

ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. గోవులను మరణాలపై హిందువులు నిరసనలు చేపట్టాలి‌‌‌… టిటిడి అనుమతి ఇస్తే ఈ రోజే ఎస్వీ గోశాలకు వెలుతాను.. గోవులను మృతికి టిటిడినే కారణం… వారి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు కరుణాకర్‌ రెడ్డి.. వెంటనే అక్కడి పరిస్థితి టిటిడి చక్కదిద్దడానికి ప్రయత్నం చేయాలి.. ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసినా పాపం మే అన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి..