పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటి దూల తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు.
Karnataka: లోపం శరీరానికే మెదడుకు కాదని నిరూపించిన వికలాంగులు.. పెళ్లితో ఒకటైయ్యారు
తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితంపై అబ్దుల్ రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.. ప్రపంచ కప్ ఫైనల్ లో క్రికెట్ విశ్వవిజేతగా నిలిచిందని ట్వీట్ చేశాడు. స్వదేశంలోని పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకుని భారత్ గెలిస్తే క్రికెట్ కు బాధాకరమైన క్షణాలే ఉండేవని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ఈ వరల్డ్ కప్ ను టీమిండియా వశం చేసుకుంటే చాలా బాధపడేవాడినని చెప్పాడు. చివరకు.. మానసికంగా దృఢంగా ఉన్న జట్టే విజేతగా నిలిచిందన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఇరు టీమ్ లకు వాతావరణం, పిచ్ సమానంగా ఉన్నాయని చెప్పాడు. ఆ మ్యాచ్ లో ఒకవేళ కోహ్లీ సెంచరీ చేసి ఉంటే టీమిండియానే గెలిచేదని రజాక్ చెప్పుకొచ్చాడు.
Jammu Kashmir Encounter: 24 గంటలుగా ఎన్‌కౌంటర్.. పాక్ కీలక ఉగ్రవాది హతం..
అయితే.. రజాక్ చేసిన పోస్టుపై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్ పై ఎంత ద్వేషం ఉంటే.. ఇలా మాట్లాడుతాడా ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ రోజు టీమిండియాకు కలిసి రాలేదని మరో యూజర్ కామెంట్ చేశాడు. పాకిస్తాన్.. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా.. తమ క్రికెట్ ను మెరుగుపర్చుకోవాలని అంటున్నారు. లేకపోతే ఆసియా కప్ లాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వదిలిపెట్టుకోవాల్సి వస్తుందని ఓ వినియోగదారు హితవు పలికాడు. అబ్దుల్ రజాక్ మాటల్లో కేవలం భారత్ పై ఈర్ష్య, అసూయ, అక్కసు కనిపిస్తున్నాయని మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.