Site icon NTV Telugu

Former MP Bharat: “చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్‌తో పోల్చారు”.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

Bharat

Bharat

మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు. లోకేష్ ను తన రాజకీయ వారసుడుగా ఏఐ వీడియోతో ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు… నందమూరి కుటుంబానికి సంబంధించి ఏ ఒక్కరు ఈ కార్యక్రమంలో లేరని.. ఒక్క పథకం ఇచ్చిన హామీ ఏడాది కాలంలో అమలు కాలేదని విమర్శించారు. ఏడాది కాలంలో చేసిన పనులు రోడ్లపైకి వచ్చి చెబితే.. ప్రజలు దుమ్మెత్తి పోస్తారన్నారు. మహానాడుకు జనాలను బెదిరించి తరలించారని ఆరోపించారు. కోనసీమలో చంద్రబాబు పర్యటన పెద్ద డ్రామాలా కనిపించిందని… పవన్ కళ్యాణ్ అడిగితే ఇంకా బాగా చెబుతారన్నారు.

READ MORE: Tuk Tuk : ఓటీటీలో అదరగొడుతున్న ‘టుక్‌ టుక్‌’ .. ఏకంగా టాప్ 3లో ట్రెండింగ్

ఎండియూ ఆపరేటర్లను చంద్రబాబు సభలో టెర్రరిస్టుల్లా చూశారని మాజీ ఎంపీ భరత్ అన్నారు. లంచాలు ఇవ్వడానికి ఎండియూ ఆపరేటర్లు తన వద్దకే వచ్చారని చంద్రబాబు చెప్పటం దారుణాతి దారుణమన్నారు. వేలకోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోర్టుకు తరలిపోతున్నాయని ఆరోపించిన మీరు.. ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి ఎండియూ ఆపరేటర్లు ఏకంగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని ఆరోపించడం హేయమైన చర్య అన్నారు. ఎండీయూ ఆపరేటర్లు కొవ్వెక్కిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించటం చూస్తే అణగారిన వర్గాలపై చంద్రబాబు జాతి దృహంకారం ప్రదర్శించినట్లు కనిపిస్తుందని తెలిపారు.

READ MORE: Satish Kumar Reddy: వైయస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..?

Exit mobile version