NTV Telugu Site icon

Karimnagar: హోటల్‌లో మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం.. అసలేం జరిగింది?

Theft

Theft

ఒక హోటల్ నుంచి మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం అయిన ఉదంతం కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఇటీవల దీక్షాధీవస్ సభ జనసమీకరణ కోసం భారీగా డబ్బుల ఖర్చు చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జిలకు పదిలక్షల రూపాయల చొప్పున సర్ధుబాటు చేసినట్లు సమాచారం. పదిలక్షలలో కేవలం ఐదులక్షలే ఖర్చు చేశారని.. కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా.. కార్యక్రమం ముగిసిన తరువాత వి పార్క్ హోటల్ లోని రూం నంబర్ 209 లో కార్యకర్తలతో కలిసి విందు ఏర్పాటు చేశారు. ఉదయం లేచి చూసే సరికి డబ్బులు మాయమయ్యాయని మాజీ ఎమ్మెల్యే గుర్తించారు.

READ MORE: Akhanda 2 : ఆ సినిమాకు బోయపాటి కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట

డబ్బులు హోటల్ లో పోయాయి కాబట్టి వి పార్క్ హోటల్ వారే డబ్బులు ఇవ్వాలంటూ సదరు నేత వాగ్వాదానికి దిగారు. తమకు సంబంధం లేదని.. మీరు లాకర్ లో పెట్టుకోలేదని.. మీదే తప్పంటూ హోటల్ యాజమాన్యం సమాధానమిచ్చింది. చేసేదేమీ లేక మాజీ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు చేస్తే అధిష్టానం వద్ద పరువు పోతుందని తన అనుచరుడితో కొత్తపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయించారు. క్రైం నంబర్407/2024 సెక్షన్ 332(c),305 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.

READ MORE:UP: భార్యను, అత్తను నరికి చంపిన భర్త.. ఎందుకంటే?

Show comments