Akhanda 2 : ఆ సినిమాకు బోయపాటి కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట
- అఖండ 2ను లైన్లో పెట్టిన బోయపాటి, బాలయ్య
- ఆ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్
- ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లతో పాన్ ఇండియా లెవల్లో మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. వారిద్దరూ కలిసి ఇప్పటికే ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’తో హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. అలా బోయపాటి-బాలయ్య అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ‘అఖండ-2’ కోసం బోయపాటి రెడీ అవుతున్నాడు. ‘డాకు మహారాజ్’ విడుదల కాగానే బాలయ్య అఖండ-2 కోసం రంగంలోకి దిగుతారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వస్తున్నారు. అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ-2ని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయపాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బోయపాటి తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also:Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
దీంతో ఇదే బోయపాటి కెరీర్ భారీ రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. ఇంతవరకూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆయన మహా అయితే 10 కోట్ల వరకూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్నారు. వాస్తవానికి అంఖడ హక్కులు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. సెకండ్ పార్ట్ కూడా ఆయనే నిర్మించాలి. కానీ ఆయన స్థానంలో కొత్త నిర్మాతలు కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్నారు. సినిమాకు ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లు తీసుకుంటున్నారు. తమన్ ని యథావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు. అఖండకు ఆయనే బాణీలను అందించిన సంగతి తెలిసిందే.
Read Also: Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు