NTV Telugu Site icon

Koneru Konappa: కాంగ్రెస్కు భారీ షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

Koneru Konappa

Koneru Konappa

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్‌ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

READ MORE: GHMC: పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం..

కాగా… సిర్పూర్-కాగజ్‌నగర్‌ కాంగ్రెస్‌లో విభేదాలు ముదిరాయి. కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడటం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్‌ను క్యాన్సిల్ చేయడంపై కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారు.. మీకు అంత సీన్ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఎవరికీ భయపడనని కూడా తేల్చిచెప్పారు. గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన విషయం కూడా గుర్తు చేశారు. సీఎంను కలిసి చాలా సార్లు ఫ్లై ఓవర్‌ పూర్తి చేయాలని చెప్పినా.. స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

READ MORE: HHVM : హరిహర వీరమల్లు ‘కొల్లగొట్టినాదిరో’ ప్రోమో రిలీజ్

ఇదిలా ఉండగా.. కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. అయితే.. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే.. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురై కాంగ్రెస్ గూటికి చేరారు కోనప్ప. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.