NTV Telugu Site icon

Vidadala Rajini : నాపై తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు..

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini : పోలీస్ బాస్‌లు పొలిటికల్ బాస్‌ల కోసం, పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని నిర్బంధించి వేధించారన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పెద్దిరెడ్డి సుధారాణిని నిర్బంధించి తీసుకువచ్చారని.. పోలీస్ స్టేషన్‌లు మార్చి తిప్పి కొట్టారని పేర్కొన్నారు.

Read Also: Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..

వైసీపీ పెద్దలు పేరు చెప్తే వదిలేస్తామని, పోలీసులు ఆ మహిళను వేధించారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు, ప్రతి ఒక్క నాయకులు వచ్చి మీకు అండగా నిలబడతారన్నారు. చట్టం అధికార పార్టీకి ఒకలాగా, ప్రతిపక్షానికి మరోలాగా పనిచేస్తుందని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టయితే వేధిస్తారా అంటూ మండిపడ్డారు. “ఒక మాజీ మంత్రిగా నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదు పట్టించుకోవడం లేదు.. నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు….అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా.. పోలీసులు రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలు కావద్దు… అలా ప్రవర్తించే అధికారులను భవిష్యత్‌లో వదిలిపెట్టేది లేదు.” అని మాజీ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు.

 

Show comments