NTV Telugu Site icon

RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా.. పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు..

Rk Roja

Rk Roja

తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.

కనీస సదుపాయాలు కరువు: రోజా
“భక్తులకు కనీస సదుపాయాలు లేవు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. తెలంగాణలో చూసాం.. ఓ ఘటనలో మహిళ చనిపోతే అల్లు అర్జున్ పై కేసు పెట్టారు.. ఈ ఘటనలో చంద్రబాబు నుంచి క్రింది స్థాయి అధికారులు బాధ్యత వహించాలి.. ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలా కేసులు నమోదు చేశారు.. విజయవాడ హైందవ శంఖారావంలో చెప్పారు.. హిందువులను కాపాడాలని చెప్పారు.. ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఏమయ్యారు.. తిరుమల లడ్డుపై బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని మాట్లాడారో అందరూ చూశారు.. మీరు చేస్తే కరెక్టు.. మరొకరు చేస్తే తప్పు అన్నట్లు చేస్తున్నారు.. ప్రధాని మోడీకి ఒకటే విజ్ఞాపన చేస్తున్నా.. బాధ్యులను కఠినంగా శిక్షించాలి..

పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు…
“సనాతన యోధుడు ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు.. చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా.. మీరు చేస్తారా..? హోం మంత్రి కేవలం ఇతరులను తిట్టడానికి తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటానికి పనికి రావటం లేదు.. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలి.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు.” అని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

 

Show comments