Site icon NTV Telugu

Pushpa Leela: కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు: పుష్ప లీల

Former Minister Pushpa Leela

Former Minister Pushpa Leela

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు అని మాజీ మంత్రి పుష్ప లీల విమర్శించారు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకి లేదని, కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది? అని పుష్ప లీల ప్రశ్నించారు.

శనివారం గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పుష్ప లీల మాట్లాడుతూ… ’10 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోని కవితకు.. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదు. రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుంది. కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు. ట్రైబల్, అసైన్మెంట్ చట్టంలో స్త్రీకి గౌరవం ఇచ్చింది ఇందిరా గాంధీ. కేసీఆర్ లాంటి ద్రోహి బిడ్డవి నువ్వు. కేటీఆర్‌ని మించిపోయావ్. కొంగ దొంగ జపం లాగా.. మహాశివ రాత్రి రోజు నీ అబద్దాల ధర్నా ఉంది’ అని విమర్శించారు.

Also Read: PM Modi: నరేంద్ర మోడీ కనికరంలేని రాజకీయ నాయకుడు: కూనంనేని సాంబశివరావు

‘జీవో నో3 హై కోర్టులో వేసాను అంటాడు కేసీఆర్. సోనియా గాంధీ బిక్ష వల్ల మీ ఫ్యామిలీకి రాజకీయ జీవితం వచ్చింది. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అనడానికి ఇదే ఓ నిదర్శనం. ట్రైబల్, బీసీ, ఎస్సీ మహిళలకి చదువుకోవడం కోసం కల్పించిన అవకాశం అది. సమాన అవకాశాలూ గత పదేళ్లలో కవితకి ఎందుకు గుర్తుకు రాలేదు. లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని కవిత రోజు ప్రజల్లోకి వస్తుంది, డ్రామాలు ఆడుతుంది. లోకసభ ఎన్నికలలో దొంగ మాటలు మాట్లాడే బీఆర్‌ఎస్ కి మహిళలు బుద్ధి చెప్తారు’ అని పుష్ప లీల అన్నారు.

 

Exit mobile version