బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు అని మాజీ మంత్రి పుష్ప లీల విమర్శించారు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకి లేదని, కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది? అని పుష్ప లీల ప్రశ్నించారు.…