NTV Telugu Site icon

Kodali Nani: కొడాలి నానికి 10 గంటలపాటు హార్ట్ సర్జరీ.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Kodali Nani

Kodali Nani

మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటలపాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు.

READ MORE: TGBIE: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన..

ఇదిలా ఉండగా.. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయ్యింది. దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవచ్చని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని నిన్న ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. ఇక్కడ ఈ రోజు సర్జరీ విజయవంతమైంది.

READ MORE: US: ట్రంప్ ఎఫెక్ట్.. అక్రమ వలసలపై సరికొత్త రికార్డ్!