NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్.పి. తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్ పై శ్రావణి అనే మహిళ ఫిర్యాదు చేయించి తప్పుడు కేసు నమోదు చేయించారన్నారు. ఆ కేసులో శ్రావణి తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు పేర్కొందని తెలిపారు. కానీ, మెటీరియల్ ఏవిడెన్స్ ఉందని చెబుతూ.. మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ ను మార్చి తీసుకెళ్లారని అన్నారు. కొవ్వురూలో స్టాంపు వెండర్ లోక్ నాథ్ సింగ్ నుంచి కొనుగోలు చేశారని ఆయన అన్నారు.

Also Read: Nimmala Rama Naidu: ప్రజలను జగన్ మోసం చేశారన్న మంత్రి నిమ్మల

ఆయన పాత తేదీని వేసి స్టాంప్స్ ను శ్రావణికి విక్రయించారని, తేదీలు మార్చినట్లు కోవూరు సబ్ రిజిస్ట్రార్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరాలు ఉన్నాయని అన్నారు. న్యాయ వ్యవస్థను పోలీసులు తప్ప దోవ పట్టించారన్నారు. జిల్లా ఎస్.పి. విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి రాకుండానే నివేదిక ఇచ్చారని అన్నారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు భయపడరని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామని అన్నారు. సోమిరెడ్డి చేసిన అవినీతిని వెంకట శేషయ్య ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. నాపై వేదయపాలెం స్టేషన్ లో ఒక కేసు పెట్టారని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడనన్నారు. 2029 వరకూ నన్ను అరెస్టు చేసి జైలులో పెట్టినా.. ఆక్కడ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తా అని వ్యాఖ్యానించారు.

Show comments