వయసు పెరగడం అనేది సహజ పక్రియ. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. వయసు పెరిగినా.. యవ్వనంగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి.
నవ్వు తప్పనిసరి: నవ్వుకి ఒత్తిడి తగ్గించే శక్తి ఉంది. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే రోజూ కాసేపు హాయిగా నవ్వాలి.
తగినంత నీరు: రోజుకు తగినంత నీరు తాగడం చర్మాన్ని హైడ్రేట్ చేసి, యవ్వనంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.
డ్యాన్స్: రోజూ డ్యాన్స్ చేస్తే శరీరం చురుగ్గా పని చేస్తుందట. మానసిక ఆనందం పొందుతారట.
ఆహారం : మనం తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. మైండ్ ఫుల్ ఈటింగ్ వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
ప్రకృతి: ప్రకృతిని ఆస్వాదించాలి.స్వచ్ఛమైన గాలి, ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మెదడు చురగ్గా పనిచేస్తుంది.
సరైన నిద్ర: స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. రోజూ తప్పనిసరిగా 7-8 గంటలు నిద్రపోవాలి.
యోగా: యెగా, ధ్యానంతో పాటు శ్వాస వ్యాయామాలు సాధన చేయాలి. రోజు పది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయ మంచిది.
వ్యాయామం: నడక, జాగింగ్, ఈత వంటి వ్యాయామాల చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి.
చర్మ రక్షణ: సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ ప్యాక్స్ ఉపయోగించాలి. వీటి వల్ల చర్మం హైడ్రేట్ గా మారి మెరుస్తుంది.