NTV Telugu Site icon

Harish Rao: కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదు..

Harish Rao

Harish Rao

మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన ప్రభుత్వం వచ్చాక.. కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారని అన్నారు. హౌసింగ్ స్కాములపై CID విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది.. ఒక్కో కాంగ్రెస్ నాయకుడు 50 ఇళ్ల బిల్లులు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Praja Bhavan: డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్

ఇదిలా ఉంటే.. ఈరోజు లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. కాగా.. ఈ ఘటనపై హరీష్ రావు స్పందించారు. 2009లో పార్లమెంట్ పై దాడి జరిగింది.. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ జరుగుతుంటేనే ఈ ఘటన జరిగింది.. అదృష్టవశాత్తూ ఎంపీలకు ఎవరికి ఏం కాలేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరగాలి.. మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాటలు గొప్పగా చెప్పడం కాదు.. చేతలు కూడా ఘనంగా ఉండాలన్నారు. గొప్పగా కట్టామని చెబుతున్న పార్లమెంట్ కే రక్షణ లేదని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Read Also: Parliament Terror Attack: పార్లమెంట్ టెర్రర్ అటాక్ 22వ వార్షికోత్సవం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరించిన రోజే భద్రతా ఉల్లంఘన..