C Ramachandra Reddy: మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత.. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
C Ramachandra Reddy: మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రముఖులు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో తలమడుగు మండలంలోని స్వగ్రామం కోదడ్‌లో శుక్రవారం జరగనున్నాయి.
చిలుకూరి రామచంద్రా రెడ్డి 1978, 1985, 1989, 2004లో నాలుగు సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందులో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా అనంతరం కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2009, 2012లలో మాత్రం పోటీ చేసి ఓటమి పాలయ్యారు రామచంద్రా రెడ్డి. ఆయన మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కి తీరని లోటుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. .
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
సీఎం సంతాపం
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి, అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, చిలుకూరి రామచంద్రా రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా వారు అందించిన స్పూర్తి గొప్పదని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సి. రామచంద్రా రెడ్డి అత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!