మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు.