Anshuman Gaekwad Dies with Blood Cancer: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ కొన్ని నెలల పాటు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. గత నెలలో స్వదేశానికి వచ్చి బరోడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కొనసాగించారు. అయినా కూడా మహమ్మారి క్యాన్సర్ పోరాటంలో ఓడిపోయారు. భారత క్రికెటర్లు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: Paris Olympics 2024: నేటి భారత షెడ్యూల్ ఇదే.. మూడో పతకం ఖాయమేనా!
కపిల్ దేవ్ సహా పలువురు మాజీ క్రికెటర్ల విజ్ఞప్తి మేరకు అన్షుమన్ గైక్వాడ్ చికిత్స కోసం కొన్ని రోజుల క్రితం బీసీసీఐ రూ.కోటి ఆర్థిక సాయం అందించింది. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులు కూడా ఆర్ధిక సాయం చేశారు. గైక్వాడ్ 1974-84 మధ్య 40 టెస్టులు, 15 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 30.07 సగటుతో 1985 రన్స్ చేశారు. పాకిస్థాన్‌పై చేసిన 201 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్. వన్డేల్లో 269 రన్స్ చేయగా.. అతడికే స్కోర్ 78 నాటౌట్. ఇక 1997-99 మధ్య భారత జట్టుకు కోచ్‌గా కూడా పని చేశారు.