Site icon NTV Telugu

Asian Cup 2023: ఇండియా-పాకిస్తాన్ రిజర్వ్ డే ప్రకటనపై భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం..!

Asia Cup

Asia Cup

Asian Cup 2023: సెప్టెంబర్ 10న ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఆ సమయంలో వర్షం పడితే ఆటను రిజర్వ్ డే చేయనున్నట్లు శ్రీలంక క్రికెట్ చెప్పింది. కేవలం భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసమే రిజర్వ్‌ డే ఉంచారు. మిగిలిన మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Chandrababu Arrested Live Updates: చంద్రబాబుకు బెయిలా.. జైలా..?.. అనే దానిపై ఉత్కంఠ

శ్రీలంక క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచినట్లు పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక క్రికెట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి డిమాండ్‌ను అంగీకరించడానికి మీపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందని వెంకటేష్ ప్రసాద్ సమాధానంలో రాశారు. మీరు మీ దేశానికి రిజర్వ్ డే ఉంచుకోలేకపోయారు… దీనికి మీరే సమాధానం చెప్పాలని తెలిపారు.

Read Also: G20 Summit Live Updates: భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఏమి జరుగుతుందనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోందని వెంకటేష్ ప్రసాద్ రాశారు. కానీ మీ దేశం యొక్క మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అయినట్లయితే, మీ క్వాలిఫైయింగ్ అవకాశాలు తగ్గిపోవా అని తెలిపారు. దీని వెనుక మీ ఆలోచన, కారణాన్ని మీరు నిజాయితీగా వివరించగలరా అని శ్రీలంక క్రికెట్ పై కామెంట్స్ చేశారు. అయితే వెంకటేష్ ప్రసాద్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version