2023 ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 రౌండ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే ఎలెవన్‌ని ప్రకటించింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచినట్లు పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక క్రికెట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి డిమాండ్‌ను అంగీకరించడానికి మీపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందని వెంకటేష్ ప్రసాద్ సమాధానంలో రాశారు.
స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా శుక్రవారం ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చైనీస్ తైపీకి చెందిన చెన్ స్జు-యుపై 4-3 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.