హైదరాబాద్ లో దారుణం జరిగింది. ప్రయివేట్ ఫైనాన్షియర్ చేతిలో మాజీ హోంగార్డ్ మృతి చెందాడు. పాతబస్తీ నుంచి కిడ్నాప్ చేసి రెండు రోజులు చిత్ర హింసలు చేయడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల అసలు, వడ్డీ కలిపి రిజ్వాన్ అప్పు తీర్చాడు.. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి మాజీ హోంగార్డ్ ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది.
Read Also: World Cup 2023: టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమన్న మాజీ కెప్టెన్
ఇక, 2 లక్షల రూపాయలు చెల్లించి కొడుకును తండ్రి విడిపించుకున్నాడు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేక పోయారు. ఇంటికి వచ్చిన తరువాత నిందితులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకపోవడంతో ఒవైసీ హాస్పిటల్ కు రిజ్వాన్ ను కుటుంబ సభ్యులు తరలించారు. ఇక, చికిత్స పొందుతూ మాజీ హోంగార్డ్ మహ్మద్ రిజ్వాన్ మరణించడంతో బాధితుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని నామా నాగేశ్వరరావు డిమాండ్