High Interest: పేద, సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ బిందాస్ గా వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్య కుటుంబం బతకడం కష్టంగా మారింది.
ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల అసలు, వడ్డీ కలిపి రిజ్వాన్ అప్పు తీర్చాడు.. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి మాజీ హోంగార్డ్ ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది.