Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prepaid and Postpaid Switching: మొబైల్ వినియోగదారుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ల మధ్య మార్పును ఇకపై ఒకే-సారిగా ఓటీపీ ఆధారిత విధానం ద్వారా సులభంగా చేయవచ్చు. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి.
Also Read
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ఇందులో భాగంగా.. ప్రస్తుతం వినియోగదారులు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ మారితే, మళ్లీ తిరిగి పోస్ట్‌పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మారడానికి 90 రోజుల నిర్బంధ కాలం (Cooling-off Period) ఉండేది. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటి మార్పు తర్వాత కేవలం 30 రోజుల్లోనే మళ్లీ మారేందుకు అనుమతి లభిస్తుంది. అయితే, అదే వినియోగదారు రెండోసారి లేదా ఆపై మరల మార్పును కోరుకుంటే, పాత 90 రోజుల లాక్-ఇన్ కాలం అమలులో ఉంటుంది. మార్పు ప్రారంభించేముందు వినియోగదారుడికి ఈ సమాచారం స్పష్టంగా తెలియజేయాలని DoT స్పష్టం చేసింది.
మొదటి మార్పు తర్వాత 30 రోజుల్లో మళ్లీ మారేందుకు అనుమతించబడుతుంది. కానీ ఆపై జరిగే ప్రతి ఓటీపీ ఆధారిత మార్పుకు 90 రోజుల గడువు వర్తిస్తుంది. ఇది మార్పు ప్రారంభానికి ముందు వినియోగదారుడికి స్పష్టంగా తెలియజేయాలని టెలికాం శాఖ తన అధికారిక X పోస్ట్‌లో తెలిపింది. వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించేందుకు DoT లాక్-ఇన్ కాలం లోపలే మార్పు కోరితే, వారు అధికారిక PoS (పాయింట్ ఆఫ్ సేల్) కేంద్రాల ద్వారా KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వినియోగదారు 30 లేదా 90 రోజుల గడువు ముగిసేలోపే మార్పును కోరితే, వారు కేవలం అధికారిక PoS లేదా లైసెన్సీ అవుట్ లెట్ వద్ద ప్రస్తుత KYC ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని DoT తెలిపింది.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!