Jai Bharath National Party: ఏపీలో రాజకీయాల్లో మరో సంచలనం.. జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటన.. పేరు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Bharath National Party: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. రాజకీయ పార్టీని ప్రకటించారు.. కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఈ రోజు మీడియా సమావేశంలో పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.. “జై భారత్ నేషనల్ పార్టీ” పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు వీవీ లక్ష్మీ నారాయణ.. జాతీయ జెండా రంగులతో జేడీ ఫొటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారు.. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం.. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీగా అభివర్ణించారు.
Read Also: Lal Salaam : తలైవా నటించిన లాల్ సలాం మూవీ సంక్రాంతికి రానట్టేనా..?
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీవీ.. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణమన్న ఆయన.. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజే ముద్దన్నారు కొందరు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు మరికొందరు.. కానీ, మెడలు వంగలేదు.. ప్రత్యేక హోదా రాదని దుయ్యబట్టారు. అయితే, ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని ప్రకటించారు. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడమని స్పష్టం చేశారు. వాళ్లు తిన్నారని వీళ్లు.. వీళ్లూ తిన్నారని వాళ్లు అంటున్నారు. వాళ్లూ.. వీళ్లూ తిన్నారని సభల్లో ప్రకటించిన వాళ్లు మద్దతిస్తున్నారని విమర్శించారు. మేం మాత్రం అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని వెల్లడించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!