రాజకీయ పార్టీని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ చెప్పుకొచ్చిన ఆయన.. ఇక, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం, వారికి మద్దతు తెలుపుతోన్న మరో పార్టీని.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఇలా.. ఎవ్వరినీ…
BRS in AP: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.. కలిసి వస్తున్న నేతలకు కండువాలు కప్పి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.. ఇక, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు బీజం పడగా.. మరికొందరు నేతలను ఆహ్వానించేపనిలో పడిపోయారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు కూడా పార్టీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నమాట.. దీంతో, తెలంగాణ…
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని…